Share News

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:36 AM

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. ఆదివారం కల్లూరు మండలం పర్లలో జరిగిన పల్లె పండుగ వారో త్సవాల్లో ఆమె పాల్గొని ఎనఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.30.22 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీలో మినీ గోకులం షెడ్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ పాణ్యం నియోజక వర్గంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ, వక్ఫ్‌, ఆలయ, పేద ప్రజల భూము లను అక్రమంగా దోచేశారని అన్నారు. ఎస్సీ, బీసీలకు శ్మశానవాటిక స్థలం కేటాయిం చాలని, పొలాల రస్తా బాగు చేయించాలని పర్ల గ్రామ టీడీపీ నాయ కులు ఆమెకు విన్నవించారు. జడ్పీ సీఈవో, డ్వామా పీడీ నాసరరెడ్డి, ఎంపీడీఓ జి.నాగ శేషాచలరెడ్డి, తహసీల్దారు కె.ఆంజనే యులు, ఏపీ ఫైనాన్స అర్బన ఇనఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ డి.రామాం జనేయులు, టీడీపీ నాయకుడు శేఖర్‌, సర్పంచు హనుమక్క, ఎంపీటీసీ మేకల శేషన్న, మహానంది, రామగిడ్డయ్య, రవి, వాకిటి మాదేష్‌, ఈవీ రమణ, దేవేం ద్రారెడ్డి, సింగం సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:36 AM