Share News

సాగు నీరు అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:50 AM

జిల్లాలోని రైతాంగానికి పంటలు చేతికి అందేవరకు సాగు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వరరెడ్డి అన్నారు.

సాగు నీరు అందించడమే లక్ష్యం
జీడీపీ నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

జీడీపీ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

గోనెగండ్ల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతాంగానికి పంటలు చేతికి అందేవరకు సాగు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వరరెడ్డి అన్నారు. మంగళవారం గాజులదిన్నె ప్రాజెక్టులోని నీటికి గంగా పూజ చేసి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు సాగు నీటిని ఎమ్మెల్యే బీవీ విడుదల చేశారు. కుడి కాలువకు 30 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువకు 30 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఈ ఏడాది రబీ సీజనలో ఆయకట్టు రైతులకు సాగు నీరు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టులో 2.2 టీఎంసీ నీరు ఉన్నందుకు ప్రస్తుతం 13వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. రైతులు వేరుశనగ, మొక్కజొన్న, సజ్జ, తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. పంటలు రైతుల చేతికి అందే వరకు సాగు నీరు అందిస్తామన్నారు. జీడీపీ నీటికి ఆర్‌డీఎస్‌, గుండ్రేవుల ప్రాజెక్టు నీరు తోడైతే జిల్లాపశ్చిమ ప్రాంతం సస్యశామలం అవుతుందని జీడీపీ, ఆర్‌డీఎస్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి అయితే ఇక వీటి కింద అధికారికంగా 40వేల ఎక రాలు సాగు అనాధికారికంగా లక్ష ఎకరాల పంట భూములు సాగ వుతాయని అన్నారు. జీడీపీ కింద ఆయకట్టు భూములకు సాగు నీరు విడుదల చేయడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. కార్యక్రమంలో ఇరిగేషన డీఈ విజయ్‌కుమార్‌, ఏఈ మహమ్మద్‌ ఆలీ, ఉగ్రనరసింహుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 12:50 AM