రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Sep 22 , 2024 | 12:14 AM
రాషా్ట్రన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శ
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, సెప్టెంబరు 21: రాషా్ట్రన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం కల్లూరు అర్బన 41వ వార్డు వీకర్‌సెక్షన కాలనీలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని అపవిత్రం చేసి వారి మనోభావాలు దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నం ద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, కమిషనర్ ఎస్. రవీంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, క్లస్టర్ ఇనచార్జి జనార్దన ఆచారి, 37, 41వ వార్డు ఇనచార్జి క్రిష్ణవేణమ్మ, నాగేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, జవ్వాజి గంగాధర్‌గౌడ్. కాసాని మహేష్‌గౌడ్, కె.ధనుంజయ, ఫిరోజ్, ఎంఈ శేష సాయి, టీపీఆర్వో వెంకటలక్ష్మి పాల్గొన్నారు.