Share News

పొదుపు మహిళల సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:48 AM

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ఓర్వకల్లు పొదుపు మహిళల అందిస్తున్న సేవలు ప్రశం సనీయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

పొదుపు మహిళల సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే
నిత్యావసర వస్తువుల వాహనాన్ని ప్రారంభిస్తున్న గౌరు చరిత

ఓర్వకల్లు, సెప్టెంబరు 6: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ఓర్వకల్లు పొదుపు మహిళల అందిస్తున్న సేవలు ప్రశం సనీయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం బాలభారతి పాఠశాలలో వరద బాధితులకు పంపించనున్న నిత్యావసర వస్తువుల కిట్ల వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గౌరవాధ్యక్షురాలు విజయ భారతి ఆధ్వర్యంలో పొదుపు మహిళల సహకారంతో 20 వేల విలువైన నిత్యావసర వస్తువులను విజయవాడ వరద బాధితుల సహా యార్థం ఎమ్మెల్యే సమక్షంలో ప్రత్యేక వాహనంలో తరలించారు. కార్యక్ర మంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు లక్ష్మీకాం తారెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీంబాషా, మండల ఐక్య సంఘం అధ్యక్షురాలు రత్నమ్మ, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:48 AM