పారదర్శక పాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Sep 25 , 2024 | 12:10 AM
పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, సెప్టెంబరు 24: పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన 32వ వార్డు ముజఫర్‌నగర్‌లో ఇది మంచి ప్రభుత్వం కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధ్య క్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజల్లో ఎన్డీఏ ప్రభుత్వం సంక్షోభంలోనూ ప్రజా సంక్షేమానికే పెద్దపీఠ వేసింద న్నారు. ల్యాండ్‌టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ప్రారం భం, డీఎస్సీ నోటీఫికేషన, ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అం దించేం దుకు చర్యలు తీసుకున్నారన్నారు. అనంతరం ముజఫర్‌నగర్ ప్రభు త్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు టైలర్ నాగరాజు, ఖాజాబందే నావాజ్, గిరి, ఇబ్రహీం, ఎన్వీ.రామకృష్ణ, సోమన్న, ఎస్.ఫిరోజ్, జవ్వాజి గంగాధర్‌గౌడ్, కాసాని మహేష్‌గౌడ్, పీయూ మాదన్న పాల్గొన్నారు.