రైతులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:52 AM
భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి కృషి
రెవెన్యూ సదస్సుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు
ఎమ్మిగనూరు రూరల్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గుడికల్లు గ్రామంలో శుక్రవారం ప్రారంభమైన రెవెన్యూ సదస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బీఆర్ అం బేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రెవెన్యూ సదస్సులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో జరిగిన తప్పులపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో సర్వే రాళ్లపైన తమ రంగులు కొట్టుకోవడంతో పాటు పాసుపుస్తకాలపై కూడా తమ ఫొటోలను వేయించుకున్నారు. ప్రజలు, రైతుల వద్దకే పాలనా పేరుతో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలోని రీసర్వేలో జరిగిన అన్ని తప్పులకు ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి చిరంజీవి, ప్రత్యేక అధికారి విజయ్‌కుమార్, సర్పంచ నరసమ్మ, కందనాతి సర్పంచ కేశన్న, టీడీపీ నాయకులు మల్లికార్జున, సోమేశ్వరరెడ్డి, రంగన్న, రాఘవేంద్ర, శంకర్‌గౌడు, ఎస్.నాగలాపురం వీరాంజనేయులు, గోపాల్, అయ్యళ్లప్ప, దస్తగిరి, కొండన్న రైతులు పాల్గొన్నారు.
ఫ గుడికల్లు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మసీదుపురం గ్రామస్థులు కలిశారు. మూడు నెలలుగా తమకు తాగునీరు అంద డంలేదని ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
ఫ గుడికల్లు గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును ముగించుకొని ఎమ్మిగ నూరుకు తిరిగి వెళ్తున్న సమయంలో గ్రామా నికి చెందిన ఓ మహిళ కన్నీటి పర్యంతమవుతూ చేతిలో పేపర్లు పట్టుకొని ఎమ్మెల్యేను పిలిచింది. దీన్ని గమనించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కారును నిలిపి ఆమె సమస్యను విన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని తమ పరిస్థితి దయనీయంగా ఉందని, బజ్జీలు వేసుకొని బతుకుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యే వెంటనే తన ఆరోగ్య సమస్యపై ఉన్నతాధికా రులకు రెఫర్ చేసి సమస్యను పరిష్క రిస్తానని భరోసా ఇచ్చారు.