Share News

మత్స్యకారులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:15 AM

మత్సకారులను ప్రభు త్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్త గిరి అన్నారు.

మత్స్యకారులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
సుంకేసుల డ్యాంలో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): మత్సకారులను ప్రభు త్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్త గిరి అన్నారు. కర్నూలు మండలం సుంకేసుల డ్యాంలో గురువారం మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శ్యామలతో కలిసి కోడుమూరు ఎమ్మెల్యే 4.16 లక్షల చేపపిల్లలను నీటిలోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.535 కోట్లు బడ్జెట్‌ కేటాయించిం దన్నారు. డీడీ శ్యామల మాట్లాడుతు మత్స్యకారులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్‌, వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, గూడురు మత్స్యకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా బోర్డు డైరెక్టర్‌ శేఖర్‌, మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 01:15 AM