Share News

అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:20 AM

టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, సెప్టెంబరు 26: టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. కల్లూరు అర్బన 30వ వార్డు శరీననగర్‌ పార్క్‌లోని సచివా లయం సమీపంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వ హించారు. ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాషా్ట్రన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే హామీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం చంద్రబాబు అనుభవంతో విపత్తుల్లోనూ సంక్షేమం, అభివృద్ధి దిశగా పని చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, ఎన్టీఆర్‌ భరోసా పింఛన పెంపు, అన్న క్యాంటీన, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాల అందించేలా సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారన్నారు. కాలనీలోని పార్క్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణాలు ధ్వంసం చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీలు రోడ్లు కావాలని, పార్క్‌లో పెళ్లిల్లకు హాలు ఇవ్వాలని కోరగా అధికారుతో చర్చించి ప్రజల సమ స్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికీ తిరిగి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన విజయాల కరపత్రాన్ని పంపిణీ చేసి స్టిక్కర్లు అతికించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర గొర్రెల పెంపకం మాజీ చైర్మన నాగేశ్వరరావు యా దవ్‌, బీజేపీ నాయకులు వీరప్ప, జనసేన నాయకులు తిరుమలేసు చిరంజీవి, కార్పొరేటర్‌ జయరాముడు, శైలజా యాదవ్‌, వీరేంద్ర, శ్రీనివాస్‌, ప్రత్యేక అధికారి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 12:20 AM