Share News

పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:47 AM

పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులు వచ్చేనెల మొదటి వారంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి
వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశం

ఆసుపత్రి పనుల పురోగతిపై అసంతృప్తి

ఎమ్మిగనూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులు వచ్చేనెల మొదటి వారంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు. పనుల పురుగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలు ఇతర సమస్యలపై చర్చించారు. అలాగే ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను పరిశీ లించారు. అలాగే నిర్మాణంలో ఉన్న వందపడకల ఆసుపత్రి పను లు, శిథిలమైన వైద్యసిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ బీవీ మోహాన రెడ్డి ఉన్న సమయంలో వందపడకలు నిర్మాణానికి అంకురార్పణ చేశార న్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వందపడకలకు నిధు లు మంజూరు చేయించామన్నారు. అయితే ఆపనులు నేటికి పూర్తి కాకపోవటం సరికాదన్నారు. పనులు వేగవంతగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను, సంబంధింత శాఖ అధికారు లను ఆదేశించారు. పనులు జనవరి మొదటి వారంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. వందపడకల ఆసుపత్రి ప్రారంభ సమయంలోనే ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో ఏమైన సమస్యలు ఉన్నట్లైతే తన దృష్టికి తీసుకోస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరండెంట్‌ను కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుఽధ, వైద్యులు బాలాజీ, మల్లికార్జున, చిరంజీవి, హెచడీసీ మెంబర్స్‌ సురేష్‌ చౌదరి, రామకృష్ణ నాయుడు, నాయకులు మహేంద్ర, రంగస్వామి గౌడ్‌, నవాజ్‌, శం కర్‌ గౌడ్‌, సలీం, అంబేడ్కర్‌, శాలేమ్‌ పాల్గొన్నారు.

సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే: పట్టణంలోని ఎంజీ పెట్రోల్‌ బంక్‌ నుంచి వెంకటాపురం బీటీ రోడ్డు వరకు రూ. 25లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్స్‌ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, టీపీవో రాజేష్‌, డీఈ,ఏఈలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 12:47 AM