నియోజకవర్గ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:33 AM
ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), సెప్టెంబరు 19: ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తైన నేపథ్యంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని గ్రామాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, కావాల్సిన నిధుల సమీకరణ గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు మంత్రులను ఎమ్మెల్యే అఖిలప్రియ కలిసి చర్చించారు. వైసీపీ అసమర్థ పాలనను పార ద్రోలి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిచిన సంక్షే పథకాలు, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.