మహిళా జాగృతికి న్యాయ సదస్సులు
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:41 PM
మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు నందికొట్కూ రు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. దివ్య, స్టేట్ ఉమెన్ వెల్ఫేర్ కమీషన్ మెంబర్ ఎస్.రుఖియా తెలిపారు.
మిడుతూరు, నవంబరు 20:(ఆంధ్రజ్యోతి): మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు నందికొట్కూ రు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. దివ్య, స్టేట్ ఉమెన్ వెల్ఫేర్ కమీషన్ మెంబర్ ఎస్.రుఖియా తెలిపారు. మిడుతూరులోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడుతూ ఉన్నత న్యాయస్ధానాల ఆదేశాల మేరకు మండలాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వా రు తెలిపారు. ప్రత్వేకించి మహిళల గృహహింస, వరకట్న వేధిపులు, మహిళల అపహరణ, యాసిడ్ దాడులు, మానభంగాలు జరుగకుండా మహిళలు జాగ్రత్తగా ఉండేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు ఆవస్యకత అన్నారు. ప్రధానంగా మహిళల చట్టాలను గురించి వారు వివరించారు. మహిళ చైతన్యవంతురాలు అయినప్పుడే కుటుంబం, సమాజం సౌభాగ్యవంతంగా ఉంటుందని వారు అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దశరథరామయ్య, సీడీపీవో కోటేశ్వరమ్మ, డాక్టర్ తిరుపతి, అడ్వకేట్ రమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు రేణుకాదేవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.