భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వం
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:08 PM
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు తప్ప అక్రమ భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వబోమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.
నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం
రాజంపేట, సెప్టెంబరు 26: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు తప్ప అక్రమ భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వబోమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. గురువారం సిద్దవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలో జరిగిన మన మంచి ప్రభుత్వం ప్రజాదర్బార్ గ్రామసభకు సుగవాసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు కొందరు దొంగచాటున భూకబ్జాదారులు టీడీపీలోకి ప్రవేశించి భూకబ్జాలకు పాల్పడాలని చూస్తున్నారని, తాను చేసినా ఇతరులు చేసినా దీన్ని ప్రభుత్వం క్షమించబోదన్నారు. అలాగే ఉప్పరపల్లె గ్రామంలో వారం రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం మండల టీడీపీ సీనియర్ నాయకులు, ఉప్పరపల్లె గ్రామ నేత పుత్తా బాబు, పుత్తా శివ, పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి వెంకటసుబ్బయ్య, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రామచంద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు అమర్‌నాధ్‌శర్మ, జిల్లా టీడీపీ కార్యదర్శి నాగమునిరెడ్డి, పార్లమెంట్ లీగల్‌సెల్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాజంపేట మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లునాయుడు, తదితరులు పాల్గొన్నారు.