Share News

కబ్జాదారుడిని ఇంటికి పంపుదాం

ABN , Publish Date - May 10 , 2024 | 12:55 AM

భూకబ్జాదారుడిని ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని, ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారధి అన్నారు.

కబ్జాదారుడిని ఇంటికి పంపుదాం

ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారధి

ఆదోని, మే 9: భూకబ్జాదారుడిని ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని, ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారధి అన్నారు. గురువారం పట్టణంలోని వాల్మీకీ సామాజిక వర్గంతో సమావేశమయ్యారు. అనంతరం కుమ్మరగేరి, గణేష్‌ సర్కిల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడారు. ఆదోని నియోజకవర్గంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. కనీసం తాగేందుకు కూడా నీరులేక గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాగునీటి పై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఆదోనిలో కబ్జాలకు గురైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యే సొంత ఊరు ఆదోని కాదని, ఆ వ్యక్తిది అనంతపురం జిల్లా అన్నది మరిచిపోరాదని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే ఆదోని ఎలా మారుతుందో ఒక్కసారి చూడాలన్నారు. ఒకే ఒక్కసారి మీ ఇంటి బిడ్డగా దీవించాలని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన ఇన్‌చార్జి మల్లప్ప, గెంటెప్ప, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2024 | 12:55 AM