Share News

ముందుకొస్తున్న ఆప్త హస్తాలు

ABN , Publish Date - Sep 14 , 2024 | 05:07 AM

బుడమేరు ముంపు కష్టాలను చూసి చలించని హృదయం లేదు.

ముందుకొస్తున్న ఆప్త హస్తాలు

భాష్యం విరాళం రూ.4 కోట్లు

భాష్యం పేరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. ట్రస్టు తరఫున భాష్యం విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్‌ భాష్యం హనుమంతరావు, రామకృష్ణ తనయుడు భాష్యం సాకేతరామ్‌ తదితరులు రూ.4 కోట్లు విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.

సీఎంఆర్‌ఎ్‌ఫకు కొనసాగుతున్న విరాళాలు

ఏపీ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ 2 కోట్లు, వసుధ ఫౌండేషన్‌ కోటి

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): బుడమేరు ముంపు కష్టాలను చూసి చలించని హృదయం లేదు. వారిని ఆదుకోవడానికి ఆప్త హస్తాలు ముందుకొస్తూనే ఉన్నాయి. శుక్రవారం పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, దాతలు సీఎం చంద్రబాబును కలిశారు. విరాళం చెక్కులను అందించారు. వారందరికీ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రూ.2 కోట్లు, బెకామ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ అధినేత బొల్లినేని కృష్ణమోహన్‌ రూ.1.25 కోట్లు, తులసీ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత తులసీ రామచంద్రప్రభు రూ.కోటి, విశాఖపట్నం పోర్టు ట్రస్టు కార్యదర్శి టి.వేణుగోపాల్‌, ఇతర అధికారులు రూ.కోటి విరాళాన్ని... కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర్‌ ప్రసాద్‌కు అందించారు.

వసుఽధ ఫౌండేషన్‌ విరాళం

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామానికి చెందిన వసుధ ఫౌండేషన్‌ చైర్మన్‌ మంతెన వెంకటరామరాజు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యోగులు...

ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు రూ.50లక్షలు, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు రూ.50లక్షలు, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ఇండియా డైరెక్టర్‌ కేవీఎల్పీ రాజు, ప్రెసిడెంట్‌ ఏఎన్‌ వీరారెడ్డి హోం మంత్రి అనిత ద్వారా రూ.50 లక్షలు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ ఏఎ్‌సఎన్‌ ప్రసాద్‌ రూ.32.49 లక్షలు, ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌, ప్రసాద్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తరఫున ఎస్‌ ప్రసాదరాజు రూ.25లక్షలు అందించారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.25లక్షల విరాళం డీడీని స్పీడ్‌పోస్టులో పంపారు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కుమారుడు యలమర్తి అవినాష్‌ రూ.20 లక్షలు, జయలక్ష్మీ ఫర్టిలైజర్స్‌ రూ.20 లక్షలు, సిరి సీడ్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ అరిమిల్లి వివేకానంద రూ.10 లక్షలు, చుండూరి మధుసూదన్‌రావు రూ.10 లక్షలు, శ్రీకాంత్‌ ఫ్లోర్‌ ఇండస్ర్టీస్‌ తరుపున శ్రీకాంత్‌ రూ.5 లక్షలు, ఏలూరు రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ తరఫున కే సాయి రోహిత్‌ రూ.5 లక్షలు, మీసేవా ప్రతినిధులు రూ.5 లక్షలు, ఎక్స్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తరఫున వెంకటరెడ్డి రూ.3.30 లక్షలు, డాక్టర్‌ శివప్రసాద్‌ హార్ట్‌ క్లినిక్స్‌ తరఫున పీ రోసీ శిరీష్‌ రూ.3 లక్షలు, కనగదుర్గా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ రూ.3 లక్షలు సీఎంకు అందజేశారు.

గాజులు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

సీపీఎం మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి తనవంతు సాయంగా మూడు బంగారు గాజులను సీఎం చంద్రబాబుకు అందించారు. అసోసియేషన్‌ ఫర్‌ ఏపీ పెన్షనర్స్‌ సెటిల్డ్‌ హైదరాబాద్‌ తరఫున టీఎంబీ బుచ్చిరాజు రూ.2 లక్షలు, ఏటుకూరు మాజీ సర్పంచ్‌ ఉగ్గిరాల సీతారామయ్య రూ.2లక్షలు, ఎస్‌ లక్ష్మీనారాయణ రూ.2 లక్షలు, డీ దశరథ రామానాయుడు రూ.లక్షా 23వేలు, తెనాలి వాకర్స్‌ క్లబ్‌ రూ.లక్షా 15 వేలు, కేపీఆర్‌ రాజేశ్వరీ రూ.లక్షా 11 వేలు, ఆర్‌ నరసింహారెడ్డి రూ.లక్షా 10వేలు, రాజోలు బీవీ రామకృష్ణ అండ్‌ స్కూల్‌ చిల్డ్రన్స్‌, నలందా స్కూల్‌ రూ.లక్ష, ఎం సరిత రూ.లక్ష, పీ రామమూర్తి రూ.లక్ష, ఎం.సుబ్బారాయుడు రూ.లక్ష, వెర్సిటీ సేఫ్టీ సొల్యూషన్స్‌ కే శ్రీనివాస్‌ రూ.లక్ష, కోనేరు చైతన్య కృష్ణ రూ.లక్ష, గుంటూరు జిల్లా ల్యాబ్‌ ఎక్స్‌రే ఓనర్స్‌ అసోసియేషన్‌ రూ.లక్ష, కే బాలసాయికృష్ణ రూ.50 వేలు చంద్రబాబుకు అందించారు. హైకోర్టు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అక్కిన వేణుగోపాలరావు ఉద్యోగుల బేసిక్‌ పే నుంచి ఒకరోజు వేతనం, వీఆర్వోల అసోసియేషన్‌ తరఫున ఒకరోజు వేతనానికి సంబంధించిన లేఖలను డీహెచ్‌ రవీంద్రరాజు సీఎంకు అందజేశారు. వీఆర్‌ఓలు ఒకరోజు బేసిక్‌ పేను అందించాలని నిర్ణయించారు.

లోకేశ్‌కు అందించిన విరాళాలు

మంత్రి లోకేశ్‌కు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో సేకరించిన రూ.1,63,77,261 విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన సిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఎండీ, సెక్రటరీ భీమనాథం భరత్‌రెడ్డి, శివశిరీష రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన ఏపీ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రూ.10 లక్షలు, గుంటూరుకు చెందిన పీఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రా అధినేత బీ.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, విజయవాడకు చెందిన మొక్కపాటి సత్యనారాయణ రూ.2,42,764, గుంటూరుకు చెందిన ఆరుషి ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌ అధినేత యెండ్లూరి సత్యనారాయణ రూ.లక్ష అందజేశారు.

ఎస్‌ఆర్‌ఎం వితరణ రూ.3 కోట్లు

ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్‌ డాక్టర్‌ పి.సత్యనారాయణన్‌, ఎస్‌ఆర్‌ఎం ట్రస్టీ బాలాజీ సత్యనారాయణన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (రీసెర్చ్‌) ప్రొఫెసర్‌ డి.నారాయణరావు, రిజిస్ట్రార్‌ ఆర్‌.ప్రేమ్‌కుమార్‌ బృందం శుక్రవారం సీఎం చంద్రబాబును కలిసి రూ.3 కోట్లు చెక్కును అందించింది.

Updated Date - Sep 14 , 2024 | 05:07 AM