Share News

రాష్ట్ర నిఘా చీఫ్‌గా మహేశ్‌చంద్ర లడ్డా

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:02 AM

రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది.

రాష్ట్ర నిఘా చీఫ్‌గా మహేశ్‌చంద్ర లడ్డా

నిఘా అధిపతిగా లడ్డా

కేంద్ర సర్వీసుల నుంచి

రాష్ట్రానికి.. ప్రస్తుత చీఫ్‌

కుమార్‌ విశ్వజిత్‌ బదిలీ

సీఎస్‌ నీరబ్‌ ఉత్తర్వులు

అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన్ను రాష్ట్రప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఏపీకి పంపించింది. మంగళవారం ఉదయం ఆయన జీఏడీలో రిపోర్టు చేశారు. ఆయన్ను నిఘా అదనపు డీజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ప్రసాద్‌ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు, చెవులైన కీలక నిఘా విభాగంలో నిజాయితీపరుడు, సమర్థుడైన లడ్డాను నియమిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఆయన సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా ఉన్నారు. కాగా.. జగన్‌ సర్కారుతో అంటకాగిన నాటి నిఘా అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులును ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్‌ బదిలీచేసి.. ఆయన స్థానంలో అదనపు డీజీ ర్యాంకు అధికారి కుమార్‌ విశ్వజిత్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం.. త్వరలో పోస్టింగ్‌ ఇవ్వనుంది.

Updated Date - Jul 03 , 2024 | 06:52 AM