Share News

Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’

ABN , Publish Date - Jul 19 , 2024 | 01:40 PM

అల్లరి చేస్తున్న పిల్లలను బెదిరించే క్రమంలో ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన విశాఖపట్నం పరిధిలోని గోపాలపట్నం కొత్తపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’

విశాఖపట్నం, జులై 19: అల్లరి చేస్తున్న పిల్లలను బెదిరించే క్రమంలో ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన విశాఖపట్నం పరిధిలోని గోపాలపట్నం కొత్తపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. చందన్ కుమార్ రైల్వేలో లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడి పిల్లలు కరెన్సీ నోట్లను చించివేశారు. దీంతో వారిని మందలించాడు.


ఆ క్రమంలో చందనకుమార్‌కు భార్య అడ్డుపడింది. ఈ నేపథ్యంలో భార్య పిల్లల ముందే ఫ్యాన్‌కు చీరకట్టి ఆత్మహత్య చేసుకుంటానంటూ చందన్ కుమార్.. వారిని భయపట్టే ప్రయత్నం చేశాడు. దీంతో చీర బిగుసుకోవడంతో అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే తమను బెదిరించే క్రమంలో చందనకుమార్ అలా నటిస్తున్నాడని ఆమె తొలుత భావించింది. కానీ అతడు ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండేపోయే సరికి.. భార్యకు విషయం అర్థమైంది.


దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చందన కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం అతడి మృ‌తదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు ఇదే తరహా ఘటన ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. వివాహమైన కొద్ది కాలానికే భార్యాభర్తలు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్తకు దూరంగా భార్య ఉంటుంది. ఇంటికి రావాలంటూ పదే పదే భార్యకు విజ్జప్తి చేస్తున్నాడు. ఆ విజ్జప్తిని ఆమె అలక్ష్యం చేసింది. దీంతో ఇంట్లో పీట ఎక్కి ఫ్యాన్‌కు చీరకట్టి ఉరి వేసుకుంటానంటూ.. భార్యను వీడియో కాల్ ద్వారా బెదిరించారు.


అంతలో చేతిలో ఉన్న సెల్ ఫోన్ కాస్తా కింద పడిపోయింది. దానిని పట్టుకునే క్రమంలో వంగడంతో చీర బిగుసుకు పోయింది. అంతలో పీట పక్కకు పడిపోయింది. దాంతో అతడి మరణించారు. ఈ విషయాన్ని వీడియో కాల్‌లో ఉన్న అతడి భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు ఇంటికి చేరుకునే సరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై సైతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 19 , 2024 | 01:56 PM