మంత్రాలయం మార్కెట్ వేలం పాట
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:40 PM
నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం మేజర్ గ్రామ పంచాయతీ మార్కెట్ వేలం పాట ఈవోఆర్‌డీ ప్రభావతి దేవి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి బీవీ నాగరాజు నిర్వహించారు.
మంత్రాలయం, మార్చి 12: నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం మేజర్ గ్రామ పంచాయతీ మార్కెట్ వేలం పాట ఈవోఆర్‌డీ ప్రభావతి దేవి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి బీవీ నాగరాజు నిర్వహించారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో 2024-25 ఏడాదికి గానూ దినసరి మార్కెట్ గత ఏడాది రూ.81వేలు రాగా, ఈ ఏడాది 94వేలకు పెరిగింది. వారం సంత గత ఏడాది రూ.42వేలకు పాట పోగా.. ఈ ఏడాది రూ.49వేలకు దక్కించుకున్నారు. దీంతో వేలం ద్వారా పంచాయతీకి ఆదాయం అధికంగా సమకూరిందని పంచాయతీ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య తెలిపారు. అధికంగా వేలం పాట అందుకున్న పాటాదారుడు మాణిక్యం నరసయ్య కైవసం చేసుకున్నాడు. కార్యక్రమంలో వైస్ సర్పంచు హోటల్ పరమేష్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.