Share News

విశాఖ డెయిరీలో భారీగా అక్రమాలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:15 AM

విశాఖ డెయిరీలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై సమగ్ర విచారణకు శాసనసభా సంఘం ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బుఽధవారం శాసనసభలో డిమాండ్‌ చేశారు.

విశాఖ డెయిరీలో భారీగా అక్రమాలు

విచారణకు హౌస్‌కమిటీ వేయాలని ఎమ్మెల్యేల డిమాండ్‌

ఆమోదించిన సభ.. త్వరలోనే ఏర్పాటు చేస్తామన్న స్పీకర్‌

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విశాఖ డెయిరీలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై సమగ్ర విచారణకు శాసనసభా సంఘం ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బుఽధవారం శాసనసభలో డిమాండ్‌ చేశారు. దీనిపై సభ అభిప్రాయం తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. దాంతో స్పీకరు అయ్యన్నపాత్రుడు సభ అభిప్రాయాన్ని కోరగా.. కూటమి ఎమ్మెల్యేలంతా బల్లలు చరుస్తూ సభాసంఘం ఏర్పాటుకు మద్దతు తెలిపారు. దాంతో త్వరలోనే ప్రత్యేక సభాసంఘాన్ని నియమిస్తానని స్పీకర్‌ ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖడెయిరీపై చర్చ జరిగింది. ఈ చర్చలో సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.

Updated Date - Nov 21 , 2024 | 04:15 AM