Share News

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:46 PM

నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర పాలక కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు.

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
పాత పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌

నగర పాలక కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర పాలక కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు. శనివారం సుంకేసుల రోడ్డులోని పాత పంప్‌హౌస్‌, బిర్లా కాంపౌడులోని ఖానా ఖజానాను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో తాగునీటి దాహార్తిని తీర్చేందుకు పలు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా పాత పంప్‌హౌస్‌ వద్ద 3 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మరో నూతన నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. అనంతరం ఖానా-ఖజానా నుండి సిల్వర్‌ జుబ్లీ కళాశాల వైపుకు వెళ్లే రహదారిలో అడ్డంగా ఉన్న గోడలను తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జి.రాజశేఖర్‌, ఎంఈ శేషసాయి, డీఈ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:46 PM