Share News

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:23 AM

జాతీయ స్థాయి స్క్వై మార్షల్‌ ఆర్ట్స్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 8పతకాలు సాధించినట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి నూర్‌బాష మంగళవారం తెలిపారు.

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో  జిల్లా క్రీడాకారులకు పతకాలు

నంద్యాల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి స్క్వై మార్షల్‌ ఆర్ట్స్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 8పతకాలు సాధించినట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి నూర్‌బాష మంగళవారం తెలిపారు. ఈ నెల 7నుంచి 10తేదీల్లో హర్యాణాలోని పంచకులా తావ్‌దేవీలాల్‌ ఇండోర్‌ స్టేడియంలో స్క్వై ఫెడరేషన ఆఫ్‌ ఇండియా నిర్వహించిన 25వ జాతీయ స్థాయి పోటీలు జరిగాయన్నారు. పోటీల్లో 24రాష్ర్టాల నుంచి 800మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. రాష్ట్ర జట్టులో నంద్యాల జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ వయస్సు, కేటగిరీల విభాగాల్లో ప్రాతినిథ్యం వహించి ఒక బంగారు, మూడు వెండి, 4కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు స్క్వై ఫెడరేషన గ్రాండ్‌ మాస్టర్‌ మీర్‌నజీర్‌, ఏపీ స్క్వై చైర్మన ఇస్మాయిల్‌, రాష్ట్ర కార్యదర్శి ఇబ్రహీమ్‌ చేతులమీదుగా పతకాలు అందుకున్నారని నూర్‌బాషా తెలిపారు.

Updated Date - Dec 11 , 2024 | 12:23 AM