Share News

వైద్య సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:47 PM

ఆర్టీసీ ఉద్యోగులకు పాత పద్ధతిలోనే వైద్య సౌకర్యాలు కల్పించాలని ఎంప్లాయీస్‌ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రావు.. ప్రభుత్వాన్ని కోరారు.

వైద్య సౌకర్యాలు కల్పించాలి
మాట్లాడుతున్న ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రావు

పుట్టపర్తి టౌన : ఆర్టీసీ ఉద్యోగులకు పాత పద్ధతిలోనే వైద్య సౌకర్యాలు కల్పించాలని ఎంప్లాయీస్‌ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రావు.. ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జిల్లాలోని ఆరు డిపోలకు చెందిన ఈయూ నాయకులతో పుట్టపర్తిలో సమావేశం నిర్వహించారు. దామోదర్‌రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల కు ఉద్యోగ భద్రత కల్పిం చాలన్నారు. 2019లో టీడీపీ పాలనలో సాధించుకున్న సర్క్యులర్‌ నంబర్‌ 1ని అమలు చేయాలన్నారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీకి విన్నవించామన్నారు. వారి ఆదేశాలను కిందిస్థాయి అధికారులు అమలు చేయకుండా ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, కార్యదర్శి జీవైపీ రావు, ఆరు డిపోల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:47 PM