Minister Gummidi Sandhyarani : ఐటీడీఏ, ఐసీడీఎస్ ప్రక్షాళనకు శ్రీకారం
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:25 AM
ఐటీడీఏ, ఐసీడీఎస్ విభాగాలను త్వరలోనే ప్రక్షాళన చేస్తామని స్త్రీ శిశుసంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
డోలీ మోతలు లేకుండా చేస్తాం: మంత్రి సంధ్యారాణి
విజయనగరం రూరల్, జూన్ 18: ఐటీడీఏ, ఐసీడీఎస్ విభాగాలను త్వరలోనే ప్రక్షాళన చేస్తామని స్త్రీ శిశుసంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం విజయనగరం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ పాలనలో ఈ శాఖల్లో ఏం జరుగుతుందో సంబంధిత వర్గాలకు కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు సంభవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ప్రతి హాస్టల్‌కు ఒక ఏఎన్‌ఎంను నియమించే ఫైలుపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. చాలాచోట్ల గిరిజనులు డోలీలు కట్టి ఆస్పత్రులకు వెళ్లే ఘటనలు ఉన్నాయని, నివారించేందుకు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు