Ponnam Prabhakar : ఎన్టీఆర్‌ను విమర్శిస్తే పురందేశ్వరి ఊరుకుంటారా?
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:35 AM
పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఊరుకుంటారా అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ టౌన్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఊరుకుంటారా అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌ను కేంద్ర హోంమంత్రి విమర్శించినా పురందేశ్వరీ ఏమీ జరగనట్లు మాట్లాడుతున్నారన్నారు. రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కక్షసాధింపు ఉండదని, అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సినిమా థియేటర్‌లో జరిగిన సంఘటనను వివరించారని చెప్పారు.