Share News

సర్వీస్‌ ఇనాం భూములకు హక్కులపై త్వరలో నిర్ణయం: మంత్రి అనగాని

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:57 AM

సర్వీస్‌ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ వెల్లడించారు.

సర్వీస్‌ ఇనాం భూములకు హక్కులపై త్వరలో నిర్ణయం: మంత్రి అనగాని

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సర్వీస్‌ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడారు. ‘దేవదాయ భూములు కాకుండా ఇతరత్రా వృత్తిపనివారికి గతంలో సర్వీస్‌ ఇనాం భూములు కేటాయించారు. ఆ భూమిని సాగు చేసుకోవడం తప్ప వాటిపై వారికి ఎలాంటి హక్కులూ లేవు. వారికి వాటిపై హక్కులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని అనుకొంటున్నాం. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర ఎకరాలు ఉంటాయని అంచనా’ అని వివరించారు. నగరాలు, పట్టణాల్లో 40, 50 గజాల్లో కట్టుకొన్న ఇళ్లలో కొన్ని 22ఎ నిషేధ జాబితాలో ఉన్న విషయంపై మాట్లాడుతూ ఆ సమస్య ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందో ఎమ్మెల్యేలు తమ దృష్టికి తెస్తే పరిశీలన చేసి నిర్ణయం తీసుకొంటామని మంత్రి అనగాని తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 05:57 AM