వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jun 30 , 2024 | 12:42 AM
నిరుపేదలకు వైద్యం అందించడంలో నిరక్ష్యం చేయవద్దని శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రాణిశ్రీ వైద్యులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు.
ఎమ్మెల్యే శ్రావణిశ్రీ.. ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
నార్పల, జూన 29: నిరుపేదలకు వైద్యం అందించడంలో నిరక్ష్యం చేయవద్దని శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రాణిశ్రీ వైద్యులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు..? ఓపీకి ఎంత మంది రోగులు వస్తున్నారు..? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. సిబ్బంది కొరత ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కస్తూర్బా విద్యాలయాన్ని పరిశీలించారు. మెనూ మేరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం కొత్తబస్టాండ్‌ను పరిశీలించారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గంగాధర్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గాంధీసర్కిల్‌లో దుర్వాసర రాకుండా డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని చిరువ్యాపారులకు హామీ ఇచ్చారు. వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, ఎంపీడీఓ రాముడు, ఈఓఆర్డీ శైలజారాణి, ఎంఈఓ కృష్ణయ్య, నార్పల సెక్రటరీ ఆశ్వర్థనాయుడు, టీడీపీ నాయకులు పిట్టురంగారెడ్డి, ప్రతాప్‌చౌదరి, తిప్పన్న, ఆకుల విజయ్‌కుమార్, ఆలం నాగార్జుననాయుడు, చంద్రబాబు, జనసేన నాయకులు గంజికుంటరామకృష్ణ, తుపాకులభాస్కర్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.