Share News

Guidecast: ‘గైడ్‌కాస్ట్‌’ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన విద్యాసంస్థ నారాయణ

ABN , Publish Date - Jul 18 , 2024 | 02:02 PM

విద్యాసంస్థగా దాదాపు 45 ఏళ్ల అనుభవం కలిగిన నారాయణ విద్యాసంస్థలు ‘గైడ్‌కాస్ట్’ పేరిట నూతన పాడ్‌క్యాస్ట్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలపై విద్యార్థుల తల్లిదంద్రులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు.

Guidecast: ‘గైడ్‌కాస్ట్‌’ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన విద్యాసంస్థ నారాయణ
Narayana Guidecast

  • పిల్లల మెరుగుదలపై వారి తల్లిదండ్రులకు నిపుణులతో అవగాహన కల్పించమే కార్యక్రమం ఉద్దేశ్యం

విద్యాసంస్థగా దాదాపు 45 ఏళ్ల అనుభవం కలిగిన నారాయణ విద్యాసంస్థలు ‘గైడ్‌కాస్ట్’ పేరిట కొత్తగా పాడ్‌క్యాస్ట్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలపై తల్లిదంద్రులకు నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తారు. అనేక అంశాలను కవర్ చేస్తూ సలహాలు, సూచనలు అందించనున్నారు.


పిల్లలు-తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, తద్వారా అన్ని విషయాల్లో విద్యార్థులు రాణించేలా తోడ్పాటు అందించడమే నారాయణ విద్యాసంస్థల లక్ష్యంగా ఉంది. పేరెంట్స్‌కు నిపుణులు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. విలువైన విషయాలను చెబుతారు. కాగా మొదటి సీజన్‌లో భాగంగా మానసిక మెరుగుదలపై దృష్టి సారించనున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడంలో నిపుణులు మార్గనిర్దేశనం చేస్తారు. తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడంలో తల్లిదండ్రులతో నిపుణులు మాట్లాడి సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ లింక్‌పై క్లిక్ చేసి పాస్ట్‌కాస్ట్‌ను వీక్షించవచ్చు.

Updated Date - Jul 18 , 2024 | 02:11 PM