Share News

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ మాలిని నియామకం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:48 AM

జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్‌ ఆర్‌.మాలిని నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం డీఎంహెచ్‌వోల బదిలీలు జరిగాయి. ప్రస్తుతం డీఎంహెచ్‌వోగా వున్న డాక్టర్‌ శర్మిష్టను కృష్ణా జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేయగా, గుడివాడ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ ఆర్‌.మాలిని బదిలీపై జిల్లాకు నియ మితులయ్యారు.

డీఎంహెచ్‌వోగా  డాక్టర్‌ మాలిని నియామకం

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్‌ ఆర్‌.మాలిని నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం డీఎంహెచ్‌వోల బదిలీలు జరిగాయి. ప్రస్తుతం డీఎంహెచ్‌వోగా వున్న డాక్టర్‌ శర్మిష్టను కృష్ణా జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేయగా, గుడివాడ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ ఆర్‌.మాలిని బదిలీపై జిల్లాకు నియ మితులయ్యారు. గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌గా 1994లో ఉద్యోగ ప్రవేశం చేశారు. ఏలూరు సమీపంలోని పాలగూడెం స్వస్థలం. శనివారంరాత్రి వరకు అధికారిక ఉత్తర్వులు అందలేద ని, అందినతర్వాత బాధ్యతల్లో ఎప్పుడు చేరాలో నిర్ణయించుకుంటానని డాక్టర్‌ మాలిని తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 12:48 AM