‘రా ఎన్టీఆర్’ సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఆహారం పంపిణీ
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:08 AM
‘ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి కడుపు నింపుదాం పదండి’ అనే నినాదంతో చెన్నైకు చెందిన రా ఎన్టీఆర్ సంస్థ
పిఠాపురం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి కడుపు నింపుదాం పదండి’ అనే నినాదంతో చెన్నైకు చెందిన రా ఎన్టీఆర్ సంస్థ (నెట్‌వర్క్) ఎన్టీఆర్ మీల్ కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం పాదగయ క్షేత్రం వద్ద ఈ కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. జనవరి నాటికి రాష్ట్రంలో 33 ప్రాంతాలకు కార్యక్రమాన్ని విస్తరిస్తామని సంస్థ ప్రతినిధి కిషోర్ తెలిపారు.