దుబాయ్‌లో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:29 AM
దుబాయ్‌లో మీట్ అండ్ గ్రీట్ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సినీ వజ్రోజత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): దుబాయ్‌లో మీట్ అండ్ గ్రీట్ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సినీ వజ్రోజత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ‘తారకరామం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దుబాయ్‌లోని బిర్యానీమోర్‌లో ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించిన కార్యక్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా జరిగాయి. క్రిస్మస్ కేక్‌ను జనార్దన్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు విజయం కోసం దుబాయ్ నుంచి ఎన్నారై టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలై 75 ఏళ్లయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం ఇవ్వడానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఎన్నారై టీడీపీ నాయకులు విశ్వేశ్వరరావు(యూఎన్‌ఐ), రవి, రోజా కిరణ్, దాసు, తులసి, సత్య, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.