Share News

ఒక్కరోజు ముందుగానే పింఛన్లు

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:22 AM

సామాజిక పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీన సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోంది.

   ఒక్కరోజు ముందుగానే పింఛన్లు

కర్నూలు కలెక్టరేట్‌ నవంబరు 28, (ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీన సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో నవంబరు 30వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో డీఆర్‌డీఏ అధికారులు, పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నగదు సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలు పురపాలక మున్సిపల్‌ కార్పొరేషన కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో 2,40,330 మంది లబ్ధిదారులకు రూ.102.55 కోట్లు మంజూరయ్యాయి. అదేవిధంగా రెండు నెలలు వరుసగా పింఛన తీసుకోకపోయినా మూడు నెలల మొత్తం సొమ్ము తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. పింఛన తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతనిపై ఆధారపడిన భార్య వితంతు లేదా వృద్ధాప్య పింఛన పొందేందుకు వైసీపీ ప్రభుత్వహయాంలో నెలల సమయం పట్టేది. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. పింఛన తీసుకుంటున్న ఏ కుటుంబంలోనైనా యజమాని మరణించిన మరుసటి నెలలోనే అతడి భార్యకు పింఛన అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Nov 29 , 2024 | 12:22 AM