Prakasam DIstrict: ఆపరేషన్ చిరుత విజయవంతం..
ABN , Publish Date - Jun 27 , 2024 | 09:10 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చేపట్టిన ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు విజయవంతంగా సుఖాంతమైంది. దాదాపు 24 గంటల పాటు ఆ ప్రాంత వాసులను చిరుత పులి తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో గురువారం రాత్రి చిక్కుకుంది.
ఒంగోలు, జూన్ 27: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చేపట్టిన ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు విజయవంతంగా సుఖాంతమైంది. దాదాపు 24 గంటల పాటు ఆ ప్రాంత వాసులను చిరుత పులి తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో గురువారం రాత్రి చిక్కుకుంది. దీంతో ఆ చిరుతను అడవుల్లో వదిలివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
బుధవారం సాయంత్రం దేవనగరం గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచారిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే చిరుతపులి అకస్మాత్తుగా గ్రామ సమీపంలో ఓ గుంతలో పడిపోయింది. దాంతో స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు చిరుతపై సమాచారం అందించారు. ఆ క్రమంలో చిరుతను బోనులోకి చిక్కేలా ఏర్పాట్లు చేశారు. కానీ చీకటి పడడంతో.. రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ క్రమంలో ఈ రోజు ఉదయం.. చిరుత బోనుకు చిక్కేలా ఏర్పాట్లు చేశారు. కానీ చిరుత మాత్రం రెండు సార్లు గుంతలో నుంచి బయటకు వచ్చింది. కానీ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి మాత్రం వెళ్లలేదు. దీంతో అటవీ శాఖ అధికారులు మరో ప్లాన్ సిద్ధం చేశారు. అందులోభాగంగా ట్రాక్టర్ ద్వారా నీటిని తెప్పించి గుంతలోకి వదిలే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గుంతలోని చిరుత.. బోనులోకి వెళ్లిపోయింది. దాంతో దేవనగరం పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News