Share News

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:27 AM

నిరుద్యోగులకు నిర్వహించే జాబ్‌మేళా అవకాశాలను అందిపుచ్చుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండి ఫిరోజ్‌ అన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి
మాట్లాడుతున్న ఎనఎండి ఫిరోజ్‌

నంద్యాల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు నిర్వహించే జాబ్‌మేళా అవకాశాలను అందిపుచ్చుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండి ఫిరోజ్‌ అన్నారు. నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఫిరోజ్‌ ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం జాబ్‌మేళా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఉపాధి కల్పనకు రెండు కంపెనీలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని, 80కిపైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంతరెడ్డి, ప్రిన్సిపాల్‌ డా.శశికళ, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సుబ్బన్న, స్కిల్‌హబ్‌ కో ఆర్డినేటర్‌ షేక్‌ మస్తానవలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:27 AM