Share News

పల్లెకు పవర్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:41 AM

కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత గ్రామసీమల సీను మారింది. వీటికి జీవం పోసేందుకు ఉప ముఖ్య మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగారు. ఇక అప్పటి నుంచి పంచాయతీల్లో గతంనాటి ఆటంకాలు తొలగి ఆ స్థానంలో ఒకింత ‘పవర్‌’ వచ్చింది.

పల్లెకు పవర్‌

వైసీపీ హయాంలో సర్పంచ్‌లు, నిధులు తీసికట్టు

బలవంతంగా సచివాలయ వ్యవస్థను నెత్తిన రుద్దారు

కూటమి ప్రభుత్వం రాకతో పల్లెల్లో కొత్త కాంతులు

ఉపాధి హామీకి తోడు ఆర్థిక సంఘం నిధులు

ఆ పీడ విరగడైంది : వైసీపీ సానుకూల సర్పంచ్‌లు

పవన్‌, కూటమికి జేజేలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిం చింది. ఆపై సచివాలయాలను పంచా యతీల పైకి నెట్టి సర్పంచ్‌ వ్యవస్థనే నీరుగార్చేశారు. సర్వాధికారాలు సర్పంచ్‌లు కాకుండా సచివాలయాల చేతుల్లోకి మళ్ళాయి. గడిచిన మూడున్న రేళ్లుగా ఉన్న ఆటు పాట్లను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయ తీలు అధిగమిస్తున్నాయి. ఉప ముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో ఊళ్ళకు ఊపిరొచ్చింది.

ఒకప్పుడు పంచాయతీలే అన్నింటికీ కీలకం. అయితే జగన్‌ హయాంలో వీటిని పూర్తిగా దెబ్బ తీశారు. సర్పంచ్‌లను పక్కనపెట్టి సచివాలయ వ్యవస్థను ఊళ్ళమీద రుద్దారు. ఆఖరుకి సర్పం చ్‌లే కాకుండా ఎమ్మెల్యేలూ ఎటూ తేల్చుకోలేక ప్రజలకు ప్రత్యక్షంగా తామేమీ చేయలేక నిస్సహాయులయ్యారు. పంచాయతీలు కరెంటు బకాయిలు కట్టాలంటూ 14వ సంఘం ఆర్థిక నిధులను దారి మళ్ళించారు. ఊరూరా అభి వృద్ధికి నయాపైసా లేకుండా పోయింది. పారి శుధ్య సిబ్బందికి నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వర్షాకాలం వస్తే చిన్నాచితక పారిశుధ్య పనులు మెరుగుపర్చాలన్నా కష్టమే. జనం నుంచి శాపనార్థాలు పడుతూ సర్పంచ్‌లంతా బిక్కచచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత గ్రామసీమల సీను మారింది. వీటికి జీవం పోసేందుకు ఉప ముఖ్య మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగారు. ఇక అప్పటి నుంచి పంచాయతీల్లో గతంనాటి ఆటంకాలు తొలగి ఆ స్థానంలో ఒకింత ‘పవర్‌’ వచ్చింది. పంచాయతీ ఎన్నికలు జరిగి మూడున్నరేళ్లు అయినా కనీసం తట్టెడు మట్టి ఎత్తలేని పంచాయతీల్లో ఏకంగా రూ.102 కోట్లతో ఉపాధి హామీ పనుల అమలు ను వీటి ముందుంచారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న 847 పంచాయతీల పరిధిలో రోడ్ల మరమ్మ తులు, పశువులకు షెడ్లు నిర్మించేందుకు అనువు గా వచ్చే సంక్రాంతికి పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చారు. తాము గెలిచిన తర్వాత తొలిసారిగా తమకు బాధ్యతగా అప్పగిం చిన పని ఇదేనని సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీలకు రావాల్సి న 14వ ఆర్థిక సంఘం నిధులు కరెంటు బకా ుుల పేరిట జగన్‌ ప్రభుత్వం వాడేసింది. ఇప్పు డు తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడు దల య్యాయి. వీటన్నింటినీ గ్రామసీమల అభి వృద్ధికే యఽథావిధిగా వాడతామని పంచాయతీ రాజ్‌ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ మధ్యనే ప్రకటించారు. సరాసరిన ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాలకు కూడా తల ఒక్కింటి చొప్పున నిధులు లభిస్తాయి. దీంతో మరిన్ని పనులు చేపట్టేం దుకు ఆస్కారం ఉంది.

పల్లె సీను మారింది

గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధి కంగా వైసీపీ సానుకూలురే సర్పంచ్‌లుగా ఎన్ని కయ్యారు. మొత్తం 847 పంచాయతీల్లో ఏక గ్రీవం, పోటీ కారణంగా దాదాపు 750 మందికి పైగానే వైసీపీ సానుకూలురు గెలిచారు. పార్టీ సానుభూతితో వీరందరినీ గెలిపించి నా అధికా రం విషయం వచ్చేసరికి వీరందరినీ పక్కనపెట్టే శారు. తమ సానుభూతిపరుడు సర్పంచేలేన్న ట్టుగా వైసీపీ వ్యవహరించింది. ఈ పరిస్థితి మూడున్నరేళ్లు సాగినా ఇప్పుడు మళ్ళీ పవర్‌ చేతికొస్తుండడంతో వైసీపీ సానుకూలురే ఆ పార్టీకి పూర్తిగా రివర్స్‌ అయ్యారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోను ఇదే పద్ధతిని అనుసరించా రు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఉత్సాహంతో గ్రా మాలకు జీవం వచ్చిపడడంతో వైసీపీ సాను భూతిపరులే పవన్‌కు, కూటమి ప్రభుత్వానికి జేజేలు పలకడం విశేషం. దీనికితోడు ఈ మధ్య నే పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన అనేక మంది సర్పంచ్‌లు మీరు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది, పల్లెకు ప్రాణం వచ్చింది, మాకు ఉత్సాహం వచ్చిందంటూనే తమకు వేతనాలు పెంచాలంటూ అభ్యర్థించారు. మూడు వేల నుంచి పది వేలకు పెంచాలన్నదే సర్పంచ్‌ల దీర్ఘకాలిక డిమాండ్‌. కరెంటు చార్జీలకు సంబం ధించి పంచాయతీలపై భారం వేస్తున్నారని, తాగునీటి సరఫరాకు, వీధిలైట్లకు అయ్యే మొత్తం వ్యయాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు అను వుగా మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. దీనిని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని పవన్‌ హామీ ఇచ్చారు. దీంతో పల్లెల్లోను కూటమి ప్రభుత్వానికి అను కూల సంఘీభావం మరింత పెరిగినట్టయ్యింది. ఇదే సమయంలో వైసీపీకి క్షేత్రస్థాయిలోను చేష్టలుడిగాయి.

పల్లెలు బాగు పడుతున్నాయి..

ఇంతకుముందున్న పరిస్థి తులు మారి పల్లెల కు పవర్‌ వచ్చింది. సర్పంచ్‌లు తలెత్తుకు తిరు గుతున్నారు. పంచాయతీ రాజ్‌ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవ, కూటమి ప్రభుత్వ నిర్ణయాల కారణంగా చేతినిండా పనులకు గ్రామాల్లో అవకాశం వచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఈ మధ్యనే ఉపాధి హామీ కింద కేటాయించిన నిధులతో రాబోయే కొద్ది రోజుల్లోనే పల్లె స్వరూపమే మార బోతుంది.

– పిల్లి సత్తిరాజు, గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం

Updated Date - Nov 16 , 2024 | 12:41 AM