Share News

Pawan Kalyan : శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టి

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:22 AM

వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చని, ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుధ్య సమస్యలను అధిగమించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan : శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టి

గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్‌షాపులు

గార్బేజ్‌ టు గోల్డ్‌ ప్రదర్శనలను ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చని, ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుధ్య సమస్యలను అధిగమించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఘన ద్రవ వనరుల నిర్వహణ(ఎ్‌సఎల్‌ఆర్‌ఎం) ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో ‘గార్బేజ్‌ టు గోల్డ్‌’ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించగా దానిని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. స్థానికసంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ ఒక సవాల్‌గా మారుతోందని, శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయని పవన్‌ తెలిపారు. ఇందులో అనుభవమున్న నిపుణులతో ఒక వర్క్‌షాపు నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఈ విధమైన వర్క్‌షాపుల ద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు పెరుగుతాయన్నారు. ఉపాధి అవకాశాలు వస్తాయని, పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 03:23 AM