Share News

శాంతి, స్వేచ్ఛా నౌకాయానానికే ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 15 , 2024 | 03:16 AM

హిందూ మహాసముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి, శాంతి, సుస్థిరతకు, సముద్రపు దొంగల బెడద నివారణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు. కార్యాచరణ

శాంతి, స్వేచ్ఛా నౌకాయానానికే ప్రాధాన్యం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి, శాంతి, సుస్థిరతకు, సముద్రపు దొంగల బెడద నివారణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు. కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. సముద్ర పర్యటన చేశారు. ఐఎన్‌ఎస్‌ జలాశ్వను సందర్శించి సెయిలర్లతో ముచ్చటించారు. అంతకుముందు సైనిక వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హిందూ, పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతాల్లో ఏ జాతీ నష్టపోకుండా నౌకాదళం సమర్థంగా వ్యవహరిస్తుందన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో విశాఖ వచ్చిన రాజ్‌నాథ్‌కు నేవీ ఎయిర్‌పోర్టు ఐఎన్‌ఎస్‌ డేగాలో కలెక్టర్‌ మల్లికార్జున, ఎంపీ ఎం.శ్రీభరత్‌, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ స్వాగతం పలికారు.

Updated Date - Jun 15 , 2024 | 07:54 AM