Share News

వినియోదారుని మోసగించిన ‘యాపిల్‌’కు జరిమానా

ABN , Publish Date - Sep 29 , 2024 | 06:04 AM

వినియోగదారుడిని మోసగించినందుకు కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. ఫోరమ్‌ సభ్యురాలు చక్కా సుశీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘రూ.85,800

వినియోదారుని మోసగించిన ‘యాపిల్‌’కు జరిమానా

నష్టపరిహారంతోపాటు ఏపీసీఎంఆర్‌ఎఫ్‌కు లక్ష చెల్లించాలి

ఆదేశం కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌

కాకినాడ క్రైం, సెప్టెంబరు 28: వినియోగదారుడిని మోసగించినందుకు కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. ఫోరమ్‌ సభ్యురాలు చక్కా సుశీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘రూ.85,800 పెట్టి యాపిల్‌ ఐ ఫోన్‌ కోనుగోలు చేస్తే రూ.14,900 విలువ చేసే చార్జింగ్‌ కేసుతో కూడిన ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చంటూ యాపిల్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకించింది. ఆ ప్రకటనను చూసిన కాకినాడ సూర్యరావుపేటకు చెందిన చందలాడ పద్మరాజు 2021, అక్టోబరు 13న ఆ యాపిల్‌ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కోనుగోలు చేశారు. రెండు రోజుల తర్వాత... అంటే 15న ఆయనకు ఆ ఫోన్‌ అందింది. పార్శిల్‌ తెరిచి చూస్తే ఎయిర్‌పాడ్స్‌ లేవు. దీంతో బాధితుడు యాపిల్‌ కంపెనీ ప్రతినిధిని సంప్రదించారు. ఆ ప్రతినిధి సరిగా స్పందించలేదు. ఆయన ఈమెయిల్‌ ద్వారా ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. యాపిల్‌ స్పందించింది. కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది. అయితే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో 2022, ఫిబ్రవరి 15న కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ను బాధితుడు ఆశ్రయించాడు. ఫిర్యాది వాదనలు విన్న కమిషన్‌... సాక్ష్యాధారాలను పరిశీలించింది. ఫిర్యాదికి వెబ్‌సైట్‌లో పెట్టిన వ్యాపార ప్రకటన ప్రకారం ఎయిర్‌పాడ్స్‌ లేదా రూ.14,900, ఆయన పడిన మానసిక క్షోభకు రూ.10,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 చెల్లించాలని యాపిల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను కమిషన్‌ ఆదేశించింది. మోసపూరిత ఉచిత బహుమతుల ద్వారా వినియోగదారులను ఆకర్షించి, నెరవేర్చకపోవడం తీవ్ర తప్పిదంగా గుర్తించి యాపిల్‌ సంస్థను ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చెల్లించాలని జరిమానా విధిస్తూ కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్‌, సభ్యులు చెక్కా సుశి, చాగంటి నాగేశ్వరరావు ఆదేశించారు.

Updated Date - Sep 29 , 2024 | 06:04 AM