రెవెన్యూ సమస్యలతో పాటు సంక్షేమం కోసం అర్జీలు
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:54 PM
మదనపల్లె మండ లం కొత్తపల్లెలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలతో పాటు సంక్షేమ పథ కాలు కేటాయిం చాలని పలువు రు అర్జీలు అందజేశారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె మండ లం కొత్తపల్లెలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలతో పాటు సంక్షేమ పథ కాలు కేటాయిం చాలని పలువు రు అర్జీలు అందజేశారు. గురువా రం కొత్తపల్లెలో హంద్రీ-నీవా స్పెష ల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా బుగ్గవంక, ఈశ్వ రమ్మకాలనీకి చెందిన కొందరు ప్రజలు మాట్లాడుతూ తమ ఇళ్ల స్థలాలు దేవదాయశాఖ భూముల కింద రికార్డుల్లో చూపిస్తున్నారని, వాటిపై సర్వే నిర్వహించి తమ స్థలాలు క్రయ, విక్రయాల రిజిసే్ట్రషనకు అనుమతి ఇవ్వాలని కోరారు. వాటితో పాటు రేషనకార్డులు, కొత్త పింఛన్ల మంజూరు, హౌసింగ్ పథకంలో ఇళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని పలువురు అర్జీలు అందజే శారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో అమరనాథరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ అస్లాంబాషా, ఆర్‌ఐ శేషాద్రిరావు తదితరులు పాల్గొన్నారు.
వాగు పొరంబోకు స్థలాన్ని రక్షించండి
గుర్రంకొండ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి):అక్రమణలకు గురైన వాగు పొరంబో కు స్థలాన్ని రక్షించాలంటూ రుద్రవాండ్లపల్లె, ఇరగన్నగారిపల్లె గ్రామస్థులు గురు వారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని తరిగొండలో జరిగిన రెవెన్యూ సదస్సులో ప్రజలు, రైతులు లిఖితపూర్వకంగా తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి సమీపంలోని సర్వే నెంబరు 1049లో 36.70 ఎకరాల్లో వాగు పొరంబోకు స్థలాన్ని కొందరు అక్రమించుకొని కంచె ఏర్పాటు చేశారని దీంతో గ్రామస్థులు పొలాలకు వెళ్లడానికి దారి లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికా రి లక్ష్మీపతి, నాయకులు చంద్రబాబు, నౌషాద్‌అలీ, జయప్రకాశ, అధికారులు పాల్గొన్నారు.