Share News

రోగులకు అందుబాటులో ఔషధశాల

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:25 PM

ఔషదశాలను (మందులు ఇచ్చు కౌంటర్‌) ఓపీ రోగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

   రోగులకు అందుబాటులో ఔషధశాల
మందుల కౌంటర్‌ను పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌

త్వరలో క్యాజువాలిటీ సమీపంలోకి మార్పు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఔషదశాలను (మందులు ఇచ్చు కౌంటర్‌) ఓపీ రోగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రౌండ్స్‌ నిర్వహించారు. గైనిక్‌ బ్లాక్‌ వద్ద ఉన్న ఔషదశాల ఓపీ నెంబర్‌ 13ను ఆయన తనిఖీ చేశారు. మందులు ఇచ్చు కౌంటర్‌ను అక్కడ పని చేస్తున్న ఫార్మసిస్టు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్డు వల్ల ఎండవేడిమికి కొన్ని మందులు చెడిపోతున్నాయని కొందరు సూపరింటెండెంట్‌ దృష్టికి తెచ్చారు. కొందరు ఓపీ రోగులు మందుల కౌంటర్‌ చాలా దూరంగా ఉందని సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఉన్న ఓపీ కేంద్రాల వద్దనే మందుల కౌంటర్‌ ఉండాలని సూపరింటెండెంట్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం సూపరింటెండెంట్‌ ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ శివకుమార్‌తో కలిసి మందుల కౌంటర్‌కు అనువైన స్థలాన్ని పరిశీలించారు. నిరూపయోగంగా ఉన్న నర్సెస్‌ అసోసియేషన భవనంలో మందుల కౌంటర్‌ను ఏర్పాటు చేసేలా ఎస్టిమేషన వేయాలని ఈఈని ఆదేశించారు. అలాగే మరో స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు.

Updated Date - Nov 06 , 2024 | 11:25 PM