Share News

AP Elections: ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!!

ABN , Publish Date - May 04 , 2024 | 05:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెతిస్తున్నాయి. హాట్ హాట్‌గా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు.

AP Elections: ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెతిస్తున్నాయి. హాట్ హాట్‌గా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు.

ప్రధాని పర్యటనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సరే.. రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారా? లేదా?.. ఒకవేళ వరాలు కురిపిస్తే ఏముంటాయ్..? అనే ఆలోచనలో పడ్డారు జనాలు. ఎందుకంటే.. రాష్ట్రానికి రాజధాని లేదు. అమరావతి శంకుస్థాపన జరిగినా.. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసింది.

దీంతో అమరావతి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తంతు పూర్తిగా జరిగిపోయిందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు కురిపిస్తారా? అనే అంశంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.


విమర్శలు ఉంటాయా..?

మరోవైపు.. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రధాని మోదీ విమర్శల బాణం ఎక్కుపెడతారా? లేదా? అనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయ్. ఎందుకంటే.. ఇటీవల పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.

AP Elections: ఈ ఎన్నికల్లో పవన్.. నిర్మాత.. కింగ్ మేకరా..?

ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు మోదీ హాజరయ్యారు. కానీ ఈ సభలో సీఎం జగన్ గురించి కానీ.. రాష్ట్ర ప్రభుత్వంపై కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఈసారి ఎన్నికల ప్రచారంలోఅయినా వైఎస్ జగన్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తారా?.. కనీసం ప్రస్తావన అయినా ఉంటుందా.. లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


కనీసం స్పందిస్తారా..?

ఇదిలా ఉంటే.. వృద్ధులకు పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎండదెబ్బ తగిలి కొందరు.. అనారోగ్యం పాలై మరికొందరు మరణిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

AP Elections: చెల్లిని మిస్ అవుతున్నా.. కానీ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు.. కేంద్రానికి వరుసగా లేఖలు సైతం రాశాయి. కానీ కేంద్రం నుంచి స్పందన లేదనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


పర్యటన ఇలా..!

మే 7, 8 తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. 7న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అదే రోజు సాయంత్రం అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభకు సైతం ఆయన హాజరుకానున్నారు.

Teachers Fighting: స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ డిష్యూం.. డిష్యూం

అలాగే మే 8న సాయంత్రం అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7.00 గంటలకు విజయవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు మోదీ రోడ్‌ షోలో పాల్గొంటారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఏపీకి ఏమేమి వరాలు ప్రకటిస్తారనే అంశంపై అటు రాష్ట్ర ప్రజలే కాదు.. ఇటు రాజకీయ పార్టీల అధినేతలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read National News and Telugu News

Updated Date - May 04 , 2024 | 05:02 PM