Home » Lok Sabha Election 2024
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్‌పై వెళ్తున్నారు.
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం పట్ల బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాలవియా మండిపడ్డారు.
వయనాడ్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ బెయిల్ పై విడుదల కావడంతో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు వెల్లడిస్తారన్నారు. 75 శాతం కంటే తక్కువ మంది ప్రజలు అలా కాదని సమాధానమిస్తే.. తాను లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వరుసగా వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ప్రఖ్యాత జార్ట్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మంగళవారం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.