Share News

102 కిలోల గంజాయి స్వాధీనం తమిళనాడు మహిళ అరెస్టు

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:18 AM

ఏజెన్సీ నుంచి గంజాయిని రైలులో తమిళనాడుకు తరలిస్తున్న మహిళను దువ్వాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

102 కిలోల గంజాయి స్వాధీనం తమిళనాడు మహిళ అరెస్టు

విశాఖపట్నం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ నుంచి గంజాయిని రైలులో తమిళనాడుకు తరలిస్తున్న మహిళను దువ్వాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె వద్ద 102 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ-2 మేరీప్రశాంతి కేసు వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురై ప్రాంతానికి చెందిన మహిళ 4 బ్యాగుల్లో గంజాయిని దువ్వాడ రైల్వేస్టేషన్‌కు తీసుకువస్తున్నట్టు గురువారం సమాచారం అందడంతో పోలీసులు కాపుకాశారు. స్కూటీపై వచ్చిన మహిళను తనిఖీ చేశారు. ఆమె వద్ద రెండేసి కిలోలు చొప్పున 51 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా మదురైలోనే ఉంటున్న తన మేనమామ లక్ష్మణ్‌శేఖర్‌ ఏజెన్సీ నుంచి గంజాయిని దువ్వాడ తెచ్చి తమిళనాడు వెళ్లిపోగా, తాను రైలులో అక్కడకు తీసుకువెళుతున్నట్టు తెలిపింది. గత మూడు నెలల్లో పలుమార్లు గంజాయి ఎగుమతి చేసినట్టు అంగీకరించింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.13 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. లక్ష్మణ్‌శేఖర్‌ కోసం గాలిస్తున్నామన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 03:18 AM