Share News

సీజే ఆదేశాలతో తగిన బెంచ్‌ ముందుంచండి

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:02 AM

లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే అనుమతితో తగిన బెంచ్‌ ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకో ర్టు ఆదేశించింది.

సీజే ఆదేశాలతో తగిన బెంచ్‌ ముందుంచండి

సజ్జల పిటిషన్‌పై రిజిస్ట్రీకి హైకోర్డు ఆదేశం

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే అనుమతితో తగిన బెంచ్‌ ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకో ర్టు ఆదేశించింది. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు వద్దన్న తర్వాత ఎల్‌వోసీ జారీ చేయడం ధిక్కరణ కిందకి వస్తుందా? లేదా? అనే విషయం సం బంధిత న్యాయమూర్తి తేల్చడమే సబబని వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు 120వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఇచ్చాక గుంటూరు ఎస్పీ ఎల్‌వోసీ జారీ చేయడం ధిక్కరణ కిందకి వస్తుందని, దానిని రద్దు చేయాలని కోరు తూ సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. దానిలో హోం ముఖ్యకార్యదర్శి, డీజీ పీ, గుంటూరు జిల్లా ఎస్పీ, మంగళగిరి సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.

Updated Date - Oct 22 , 2024 | 04:04 AM