Share News

పర్యాటక రంగానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:45 PM

సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి మండలంలోని అమ్మగొండ్యపాళ్యం అటవీ ప్రాంతంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నగర వనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

పర్యాటక రంగానికి ప్రాధాన్యం : కలెక్టర్‌
నగరవనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ టీఎస్‌ చేతన

పుట్టపర్తి టౌన, డిసెంబరు 24(ఆంధ్ర జ్యోతి): సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి మండలంలోని అమ్మగొండ్యపాళ్యం అటవీ ప్రాంతంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నగర వనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో రిజర్వు ఫారెస్టులో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి నగరవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహనతో పాటు, ఆహ్లాదాన్ని ఇవ్వడానికి అటవీ ప్రాంతాలతో ఈటూరిజం ఏకో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన నగర వనాన్ని క్షుణంగా పరిశీ లించి, పర్యాటకుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటవీశాఖాఽ దికారుల కు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలోని పలు దర్శనీయ స్థలాలను కూడా పర్య టక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖా ధికారి చక్రపాణి, బుక్కపట్నం రైయింజ్‌ అధికారి యామినిసరస్వతి ఉన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:45 PM