Share News

ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:57 PM

ర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలను పరిష్కరించాలని, రోగులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగళ్‌రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లును కోరారు. శ

   ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి
సూపరింటెండెంట్‌ను కలిసిన ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి

ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగళ్‌రెడ్డి

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలను పరిష్కరించాలని, రోగులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగళ్‌రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లును కోరారు. శనివారం సాయంత్రం కొత్తగా సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లును వెంగళ్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ఔషదశాల రేకుల షెడ్డులో ఉండటం వల్ల చిన్న పిల్లలు, గర్భిణులకు చెందిన మందులు చెడిపోతున్నాయని, ఎలుకల బెడద అధికంగా ఉందని చెప్పారు. ఔషదశాలను తక్షణమే మార్చి రోగులకు దగ్గర ఉండే క్యాజువాల్టీ సమీపంలో మార్చాలని కోరారు. నర్సింగ్‌ సిబ్బందికి వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని, నర్సెస్‌ అసోసియేషన భవనానికి మమ్మతులు చేయించాలని కోరారు. మినిస్టీరియల్‌, పారామెడికల్‌ సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ దస్తగిరిరెడ్డి, కర్నూలు సిటీ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఏపీ జేఏసీ కో చైర్మన మద్దిలెటి, ఏపీ ఫార్మాసిస్టు అసోసియేషన రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు వీరాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు రంగస్వామి, సత్యప్రకాష్‌, వలి, ఏపీ నర్సెస్‌ అసోసియేషన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.లీలావతి, సి.బంగారి, కోశాధికారి ఎన.లక్ష్మీనరసమ్మ, ఈసీ సభ్యులు ఎస్‌.సోమేశ్వరి, శాంతిలత, జే.ఉమారాణి, రామతులసి పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:57 PM