Share News

కార్డుదారులకు సకాలంలో రేషనివ్వండి

ABN , Publish Date - Aug 04 , 2024 | 01:00 AM

జిల్లాలోని374 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు నిర్దేశించిన గడువులోగా రేషన్‌ అం దజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీ నా ఆదేశించారు.

కార్డుదారులకు సకాలంలో రేషనివ్వండి

కృష్ణలంక, ఆగస్టు 3: జిల్లాలోని374 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు నిర్దేశించిన గడువులోగా రేషన్‌ అం దజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీ నా ఆదేశించారు. జిల్లా పౌరసరఫరా శా ఖాధికారులతో కలిసి శనివారం సింగ్‌నగర్‌ వద్ద మొబైల్‌ డిస్పెన్సరీ వెహికల్‌ (ఎండీయూ) ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పా టు ఎలాంటి లోటుపాట్ల లేకుండా పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతినెల 17లోగా ఎండీయూ ఆపరేటర్లు తమ పరిధిలోని రేషన్‌ పంపిణీ పూర్తిచేయాలన్నా రు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు పంపిణీని పర్యవేక్షించాలన్నారు. అనంతరం రైతుబజార్‌లో బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్‌ను జేసీ పరిశీలించారు. జేసీతో పాటు డీఎ్‌సవో ఎం.మోహన్‌బాబు, రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారి కోటేశ్వరరావు ఉన్నారు.

సీఎం దృష్టికి రేషన్‌ డీలర్ల సమస్యలు

మొగల్రాజపురం: ముఖ్యమంత్రి చంద్రబా బు దృష్టికి రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార నిమిత్తం తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌లో వినతి పత్రం రూపంలో అందచేసినట్టు జిల్లా రేషన్‌ డీలర్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పి.శివప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్స్‌ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జొన్నల గడ్డ శ్రీనివాసరావు, కోశాధికారి పోశంశెట్టి పూర్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 01:00 AM