Share News

andhra Pradesh: పల్నాడులో పంజాబ్‌ హిమోగ్లోబిన్‌-డీ వేరియంట్‌

ABN , Publish Date - May 28 , 2024 | 05:00 AM

పంజాబ్‌ హిమోగ్లోబిన్‌-డీ వేరియంట్‌.. ఇదో రకం రక్తహీనత. జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారి రక్తం లో హిమోగ్లోబిన్‌ 5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది.

andhra Pradesh: పల్నాడులో పంజాబ్‌ హిమోగ్లోబిన్‌-డీ వేరియంట్‌

ఏపీలో తొలిసారిగా రెండు కేసులు వెలుగులోకి

గుంటూరు(మెడికల్‌), మే 27: పంజాబ్‌ హిమోగ్లోబిన్‌-డీ వేరియంట్‌.. ఇదో రకం రక్తహీనత. జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారి రక్తం లో హిమోగ్లోబిన్‌ 5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది.

చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి రాష్ట్రంలో తొలిసారి వెలుగుచూసింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి పెథాలజీ వైద్యనిపుణులు.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలోని శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో ఈ అరుదైన వ్యాధిని గుర్తించారు.

రక్తహీనతతో బాధపడుతున్న పలువురికి జీజీహెచ్‌లో రెండు రోజుల క్రితం తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఈ కేసులు వెలుగు చూసినట్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై కిరణ్‌కుమార్‌ వెల్లడించారు.

ఈ తరహా వ్యాధిని గుర్తించడం ఇదే మొదటిసారని తెలిపారు. వీరికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స అవసరమన్నారు. పెథాలజీ విభాగాధిపతి డాక్టర్‌ అపర్ణ మాట్లాడుతూ..

ప్రభుత్వం సహకరిస్తే శ్రీరాంపురం తండాలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఇతర పిల్లల్లో కూడా ఈ వేరియంట్‌ ఉందేమో గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - May 28 , 2024 | 05:01 AM