Share News

మాట్లాడుతున్న పుట్టా శేషు

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:49 PM

ఆధునిక జీవనశైలిని మార్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆర్‌ఎ్‌సఎస్‌ ఏపీ ప్రాంత కుటుంబ ప్రబోధన ప్రముఖ్‌ పుట్టా శేషు అన్నారు.

మాట్లాడుతున్న పుట్టా శేషు
జీవనశైలిని మార్చుకోవాలి

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆధునిక జీవనశైలిని మార్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆర్‌ఎ్‌సఎస్‌ ఏపీ ప్రాంత కుటుంబ ప్రబోధన ప్రముఖ్‌ పుట్టా శేషు అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని వీఆర్‌ కాలనీలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ మంటపంలో, ధన్వంతరి జయంతి వారోత్సవాల్లో భాగంగా, ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళనం, వార్షిక క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎం అండ్‌ హెచఓ డాక్టర్‌ ఎల్‌ భాస్కర్‌, ఆరోగ్యభారతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ పి. మోక్షేశ్వరుడు, బి. సత్యనారాయణ రెడ్డి, ఆరోగ్యభారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్‌ వైద్యాధికారి డాక్టర్‌ డి. ప్రభాకర్‌రెడ్డి, ఆరోగ్యభారతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎండీవీఎన రామశర్మ హాజరయ్యారు. పుట్టా శేషు ‘మన ఆహారమే మన ఆరోగ్యం’ అనే అంశంపై మాట్లాడుతూ మన ఆరోగ్యం మనచేతుల్లోనే, మన చేతల్లోనే ఉందని చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకు జీవన చక్రంలో నిర్వహిస్తున్న అంశాలన్నీ విభిన్నంగా నిర్వహిస్తున్నందునే అనేక మంది జీవితంలో రుగ్మతలు, వ్యాధులు తలెత్తుతున్నాయని అన్నారు. జీవన శైలిని మార్చుకొని క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలు, శారీరక వ్యాయామాలు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యానికి మార్గాలు ఏర్పరచుకోవచ్చని చెప్పారు. డీఎం అండ్‌ హెచఓ డాక్టర్‌ ఎల్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఆరోగ్య భారతి సంస్థ ఆర్యోగవంతమైన సమాజాన్ని ఆవిష్కరించడంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌ వెంకటరమణ, ఉపాధ్యక్షులు ఎస్‌ క్రిష్ణవేణమ్మ, నగర సంఘటన కార్యదర్శి ఎం భరతకుమార్‌రెడ్డి, ఆరోగ్య మిత్రలు రమాపరభ, బి. మహేశ, శేఖర్‌గుప్త పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:49 PM