Share News

Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ

ABN , Publish Date - Oct 04 , 2024 | 06:37 AM

రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ శుక్రవారం సమావేశం కానున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి సాకారమవుతాయని ఎంపీలు గట్టిగా ప్రస్తావించనున్నారు.

Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ

విజయవాడ: రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ శుక్రవారం సమావేశం కానున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి సాకారమవుతాయని ఎంపీలు గట్టిగా ప్రస్తావించనున్నారు. అమరావతి నూతన రైల్వే లైన్, కొత్త రైళ్లు, ఆర్వోబీ, ఆర్ యూబీ నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలూ చర్చకు రాను f న్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించి ఐదున్నరేళ్లయినా ఇప్పటికే ఏర్పాటు కాలేదు. విశాఖలో జగన్ సర్కారు ఇచ్చిన భూములు సమస్యాత్మకమైన వని తేలింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం జోన్కు భూములిచ్చింది. ఇక కోటిప ల్లి-నరసాపురం ప్రాజెక్టులో భాగంగా వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి.


కొత్త జోన్లో విజయవాడ డివిజనే పెద్దది..

కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్ కనుమరుగు కానుంది. కొంత వి భాగం రాయగడ డివిజన్లో, ఇంకొంత విజయవాడ రైల్వే డివిజన్లో విలీనం కాను న్నాయి. విజయవాడ డివిజన్ పరిధి రెండు రెట్లు పెరగబోతోంది. ప్రస్తుతం ఈ డివిజన్లో 450 కిలోమీటర్ల రూట్ లెంగ్త్ ఉంది. రన్నింగ్ ట్రాక్ 979 కిలోమీటర్లు, ఇప్పుడు కొత్త జోన్ ఏర్పాటుతో రూట్ లెంగ్త్ MM కిలోమీటర్లు, రన్నింగ్ ట్రాక్ 2831 కిలోమీటర్లకు చేరుకుంటుంది. నూతన జోన్లో గుంటూరు, గుంతకల్ డివి జన్ల కంటే కూడా విజయవాడ డివిజన్లో అత్యధికంగా 2631 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ ఉండడం గమనార్హం. ఎలక్ట్రికల్-డీజిల్ లోకోషెడ్లు, కోచింగ్ డిపోలు, వ్యాగన్ వర్క్షాప్లు తదితర అనేక రైల్వే ఆస్తులు ఈ డివిజన్లో విలీనం కాబోతున్నాయి.

Pawan Kalyan : సనాతన ధర్మంపై దాడిని సహించం!

Updated Date - Oct 04 , 2024 | 06:39 AM