Share News

వినియోగదారుల హక్కులపై ర్యాలీ

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:53 PM

వినియోగదారుల హక్కులపై పట్టణంలో అవగాహన ర్యాలీని ఆర్డీఓ మహేశ శుక్రవారం నిర్వహించారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

వినియోగదారుల హక్కులపై ర్యాలీ
ధర్మవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు, సభ్యులు

ధర్మవరం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల హక్కులపై పట్టణంలో అవగాహన ర్యాలీని ఆర్డీఓ మహేశ శుక్రవారం నిర్వహించారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, వినియోగదారుల సంఘ సభ్యులు, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన పెంచుకో వాలన్నారు. ఈ ర్యాలీలో తహసీల్దార్‌ సురేశబాబు, వినియోగ దారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలా ప్రభాకర్‌, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రశాంతి, బాలుర ఉన్నతపాఠశాల హెచఎం శైలజ, వినియోగదారుల సంఘం పట్టణ అధ్యక్షుడు కుళ్లాయప్ప, కోశాధికారి రవీంద్ర, గౌరవాధ్యక్షుడు గోవిందు,సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:53 PM