Share News

mla kalava రథం దహనం వెనుక హెచసీ

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:23 PM

రాముల వారి రథం దహనం వెనుక పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి పాత్ర ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రథం దహనం కేసులో వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశఽ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం హర్షణీయమని అన్నారు.

mla kalava రథం దహనం వెనుక హెచసీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, సెప్టెంబరు 25: రాముల వారి రథం దహనం వెనుక పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి పాత్ర ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రథం దహనం కేసులో వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశఽ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం హర్షణీయమని అన్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒకే వ్యక్తి రథం తలుపులు బద్ధలు కొట్టి నిప్పంటించడం సాధ్యంకాదని అన్నారు. నిందితుడికి నలుగురైదుగురు సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి పాత్ర ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారని అన్నారు. కణేకల్లు పోలీ్‌సస్టేషనలో విధులు నిర్వహించినంత కాలం ఆయన వైసీపీకి తొత్తుగా వ్యవహరించారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై అనేక అక్రమ కేసులు బనాయించారని అన్నారు. హనకనహాళ్‌ గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు ఈశ్వరరెడ్డి రఘునాథరెడ్డికి సమీప బంధువని అన్నారు. బంధువుల్ని కాపాడటానికి వచ్చాడా..? ఒక్కరే నేరం చేసినట్లు నమ్మించే పథకాన్ని రచించడానికి వచ్చాడా అని అనుమానం వ్యక్తం చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథ్‌రెడ్డి కాల్‌ డేటాను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు.

Updated Date - Sep 25 , 2024 | 11:23 PM